Basic Information
శ్రీ జాస్తి రామకృష్ణ చౌదరి గారు నాకు అత్యంత ఆప్తులు మంచి మిత్రులు. అతని కవిత్వమంటే. నాకు చాలా ఇష్టం. అతను ఎ రోజూ కూడా కవిత రాయకుండా ఉండలేడు. నేను కూడా అతని కవితలు చదవకుండా ఉండలెను. ప్రతి రోజూ కనీసం రెండు కవితలు వ్రాస్తాడు తను. ఒక కవితకి ఇంది. కవితకి పొంతన ఉండదు. వెంటనె వస్తువు మారిపోతుంది. కవితా శైలి కూడా తదనుగుణంగా మారిపోతుంది. అతను ఎన్నో వెల కవితలు రాయడం జరిగింది. అతనొక అరుదైన కవి అని చెప్పడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. అతని మదిలోని ఎన్నో భావాలు, అతని హృదిలో ఎన్నో బాధల స్పందనలు, ఎన్నో అనుభవాల్ని ఈ కావ్యంలో అక్షరీకరించి ఆవిష్కరించడం జరిగింది. అతనికి కవిత్వమె ఊపిరి. అంతే కాదు అతను అక్షరాలతో ఆడుకుంటాడు. మనల్ని కూడా తన కవిత్వ వైవిధ్యపు భావవల్లరితో ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. అనేక వస్తువులు అతను కవిత్వానికి సాధనాలు, ఎక్కడ మూలాల్లోకి వెళ్తాడు తను. ఈ విశ్వం ఆవల ఎక్కడొ అనంతంలోకి వెళ్ళిపోతాడు. అన్ని బాధలు తనవె అన్నట్టు, తను ఈ సమాజం గురించి ఈ ప్రపంచం గురించి బ్రతుకుతున్నట్లు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతూ కవిత్వసాధన చేస్తూ గొప్ప కవిత్వం రాస్తూ వస్తున్నాడు తను. ఆ విధంగా అనేక భావాలతో ఈ సాంఖ్యయోగం అనే కవిత్వ సంపుటిని వ్రాయడం చేశాడు తను. ఆ ఓపికకి అతని అకుంటిత దీక్షకి అతన్ని మెచ్చుకోవాలి. సమాజంలోని అనేక సమస్యల మీద అనేక అసమానతల మీద అలాగే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అనేక వైషమ్యాల మీద, అన్యాయాల మద తన కలంలొ గొంతు ఎప్పి ఈ కవితా సంపుటిలొ ప్రతిఘటించడం జరిగింది. "రవి గాంచనిది కవి గాంచుని" అన్నారు. ఇది అక్షరాలా నిజం. సూర్యుడు చూడలేని ప్రదేశాలని పరిస్థితులను ఒక్క కవి మాత్రమె చూడగలడు, అమలాపురం నుండి అమెరికా వరకూ'నే కాదు స్వర్గంలోకి కూడా వెళ్ళి తిరిగి వచ్చి వాటి మీద అద్భుతమైన కవిత్వం. 달 నైపుణ్యం గల కవి మన జాస్తి రామకృష్ణ చౌదరి గారు. అతను మితభాషి. కాని చమత్కారి. అతని మాటల్లో గాంభిర్యం అతని ముఖంలో వర్చస్సు, అతని ఆలోచనల్లో వాడి వేడి అమోఘం. శ్రీ జాస్తి రామకృష్ణ చౌదరి గారు రాసి ప్రచురించిన ఈ " సాంఖ్యయోగం" అనే కావ్యసంపుటి జయప్రదమై అనేక మందికి చెరి అందరూ చదివి ఆదరించి ఆనందించి దీవిస్తారని ఆశిస్తూ అలాగే కవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతూ ------