SANKHYAYOGAM
-
TypePrint
- CategoryNon-Academic
- Sub CategoryFiction
- StreamShort Story-Fiction
సాహితీ రాజనాలను పండిస్తున్న నిత్య సాహితీ కృషీవలుడు శ్రీ జాస్తి రామకృష్ణ చౌదరి గారు
చాలా మంది కవులు, రచయితలు కాలక్షేపానికో,పేరు కోసమో లేదా డబ్బు కోసమో కవిత్వం రాస్తారు. కానీ.. కొంత మంది మాత్రమే బాధ్యత కలిగిన కవిగా సమాజంలోని సమకాలీన సంఘటనలను, వ్యవస్థలోని అవస్థలను చూసి చలించి తమలో కలిగిన స్పందనలను అక్షరాల్లోకి మార్చి మన ముందుంచుతుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో జాస్తి రామకృష్ణ చౌదరి గారుంటారు. జాస్తి గారు రాసిన ప్రతి కవిత వెనక ఒక ఆవేదన, ఆర్తి నిక్షిప్తమై ఉంటాయి. సామాజిక రుగ్మతల మీద, సమస్యల మీద స్పందించడం రామకృష్ణ గారికి పెన్నుతో పెట్టిన విద్య. కేవలం ఐదు, పది లైన్లలో కాకుండా సుదీర్ఘమైన కవిత లో తాను చెప్పదలుచుకున్నది సూటిగా, స్పష్టంగా, ఏ జంకు లేకుండా, డొంక తిరుగుడు లేకుండా ధైర్యంగా చెప్పగలిగే సాహసి, సమాజం పట్ల బాధ్యత కలిగిన కవి, రచయిత జాస్తి గారు.
ఒక్కోసారి సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద అక్షరాలతో అగ్నిని సృష్టిస్తూ, ప్రశ్నల శరాలను సంధించడం ఈయనకు అలవాటు. చాలా మంది కవులు లాగా ప్రశ్నలను సంధించడం వరకే కాదు;చక్కని పరిష్కారాలను కూడా సూచించి, మార్పును, హితాన్ని ప్రబోధించే నేర్పు కలిగిన సాహితీ మూర్తి జాస్తి గారు. తాను తీసుకున్న వస్తువు ఏదైనా సరే! దానిని కూలంకషంగా చర్చించడం ఈ కవి గారి పద్ధతి. జాస్తి గారు కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలోనూ అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట. ఆంగ్లంలో కూడా కొన్ని కవితా సంపుటాలను కూడా అచ్చొత్తించారు. నేను 90వ దశకంలోనే వీరి కొన్ని కవితలను,కథలను కొన్ని వార పత్రికలలో చదివాను. ప్రతి కవిత కూడా ఆసాంతం చదివిస్తుంది, ఆశ్చర్యపరుస్తుంది, ఆలోచింపచేస్తుంది కూడా. అలాగే కథలు కూడా అంతే. వీరి కథలలో కథనం ,శై లి చాలా అద్బుతంగా ఉంటాయ్. ఇది నిజం.
**Note: IIP Store is the best place to buy books published by Iterative International Publishers. Price at IIP Store is always less than Amazon, Amazon Kindle, and Flipkart.
COMMENTS
No Review found for book with Book title. SANKHYAYOGAM