book

కోనసీమ రుక్మిణి - కాలిఫోర్నియాకృష్ణుడు

  • TypeEbook
  • CategoryNon-Academic
  • Sub CategoryNon Fiction
  • StreamNovel

కోనసీమ రుక్మిణీకాలిఫొర్నియా కృష్ణుడు, నవలకు మూలం కోనసీమ, అందులో సంప్రదాయాలు, బ్రాహ్మణ సంప్రదాయాలు ఇంకా నిలబడుతున్న ప్రాంతం కోనసీమ. కొబ్బరి తోటలు,కంద,అరటి వరి కాకుండా ఇతర వాణీజ్య పంటలుతో అలరారే సస్యశ్యామలమైన గోదావరి, ఒకవైపు సముద్రం.పిఉల్ల కాలువలు పంటల్ని సస్యశ్యామలం చేస్తుంటే వరదకు ఒండ్రుమట్టి కొట్టుకువచ్చి పొలాలకు జీవం కలగజేస్తుంటే,సొంత ఇల్లు,నాలుగు కొబ్బరి చెట్లు ఉన్న కుటుంబం కోనసీమలో కాపురం చెయ్యచ్చు.

మండువాలోగిళ్ళు,ప్రశాంత వాతావరణం ఈరోజుకీ బ్రాహ్మణ అగ్రహారాలలో వినిపించే వేదఘోషతో పవిత్ర క్షేత్రం కోనసీమ. కోనసీమ ఆడబడుచులు చక్కని అందగత్తెలు, ఈనాటి అత్యాధునిక అలంకరణలకు ఎక్కువ పోకుండా కనుమక్కుతరుతో సహజ సౌందర్యంతో భాసించే చక్కటి ఆడబడుచులు.

బ్రాహ్మణ్యానికి సంఘం లో ఏదన్నా సమస్య తలపడితే పూర్వం పీఠాదిపతులనుంచి ఆంక్షలు తెప్పించేవారు. ఇది చాలా కాలం సాగింది.కోనసీమలో చక్కని పర్శాంత వాతావరణం.తన అందం దాచుకుని చంద్రుడు, గోదావరి సడిలేని సన్నని కెరటాల మీద ప్రతిబింబిచే చంద్రకాంతి గోదావరి మధ్యలో ఇసుకదిబ్బలు,గూడు పడవలు, కోనసీమ లో ఉండేవాళ్ళు అద్రుష్టవంతులు. వాళ్ళకు బయట కుతంత్రాలు తెలియవు.

కానీ ఎందుకో జనం మాత్రం కోనసీమ జనం అంటే భయపడతారు. మానాన్న ఆఫీసువాళ్ళు సైతం కోనసీమ ట్రాన్స్ ఫరు అంటే ఖంగారు పడతారు.

రాముడు ముక్తీశ్వరం రేవు దాటగానే కోనసీమలో అడుగుపెట్టాడట. అప్పటిదాకా అన్నగారి మూటా ముల్లె మోసిన లక్ష్మణస్వామికి ఒక్కసారిగా చిరాకు కలిగింది.

వెంటనే మూటా, ముల్లె కింద పారేసి, రాముడ్ని ఏమయ్యా నీ మూటా, ముల్లె మోయడానికి నేనేమైనా నీ నౌకర్నా, నువ్వే మోసుకో అని చిరాకు పడ్డాడట.వాళ్ళు సఖినేటిపల్లి రేవు దాటేసరికి సామాన్లు రాముడు మ్రోస్తుండటం చూసి అమ్మో ఇదేమిటన్నా, నేనుండగా నువ్వు మ్రోస్తున్నావని పశ్చాత్తాపపడి సామాన్లు తీసుకున్నాడట.

సీత ఏదో అడగబోతే రాముడన్నాడట, చెలీ అది మనం నడచిన నేల మహత్యం, అది కోనసీమ అన్నాడట.

ఇక్కడ మనుషులను చూస్తే అందరికీ భయం.

చిలకమర్తి, కందుకూరి వారి ప్రహసనాల్లో చక్కగా పప్పు మామిడి కాయ, పనసపొట్టు కూర, కందా బచ్చలి కూర, కొత్తావకాయ, మామిడిపళ్ళూ, పనసతొనలతో భోమ్చేసి, అరగుమీద అంగవస్త్రం వేసుకుని కునుకు తీసి లేచిన బ్రాహ్మడి తలలో ఏమీ తోచక ఆలోచన మొదలవుతుంది.ఎదురుగా సరిహద్దురాయిని తన జాగాలోకి కొద్దిగా మార్చుకుని, ప్రక్కవాడు తన జాగాలోకి వచ్చాడు అని పిటీషను పారేస్తాడు. ఆపైన రెండు సంవత్సరాలు సరదాగా కేసు నడిచి రెందు కుటుంబాలకూ రెండు ఎకరాలు ఖర్చయి కాలక్షేపం అవుథుంది. అలాగే ప్రహసనాల్లో కనకయ్య పంతులు కంతి అని ఉంది.

ఇద్దరు స్నేహితులు ఇరవై ఏళ్ళ తర్వాత కలుస్తారు. మాటల సంధర్భం లో గురువుగారు తమ ఇద్దరి చేత వీపు గోకించుకున్నప్పుడు అక్కడ కంతి ఉండేదని, కంతి నిమ్మకాయంత అని ఒకడంటే, కాదు దబ్బకాయంత అని ఇంకోడు దెబ్బలాడుకుని కోర్టుకి ఎక్కి, చెరో రెండు ఎకరాలు అమ్ముకుంటారు.”

వ్యంగ్య రచనలమూలంగా భయపడినా, కోనసీమ కొబ్బరి ఊట నీళ్ళల్లో లౌక్యం ఉంది.

ముగించేముందు మా చిన్నప్పటి ముచ్చట ఒకటి చెబుతాను.        

మేము అగ్రహారం వీధిలో ఉండేవాళ్ళం. వీధిలో అప్పటికే ఏడుగురు సంతానం తో ఉన్న గ్రుహిణి, బోరుకొట్టి ఒక ఇరవై మూడేళ్ళ కుర్రాడితో వెళ్ళిపోయి, మూడు సంవత్సరాలు దేశమంతా చూసి వచ్చింది. మొగుడు ఏమ్ చేస్తాడు, ఆవిడ్ని మన్నించేశాడు. కానీ కోనసీమ బ్రాహ్మణ్యం వాళ్ళని వెలివేసిందిRead More

Buy From
IIP Store ₹ 192
Amazon Kindle ₹ 0
Book Title కోనసీమ రుక్మిణి - కాలిఫోర్నియాకృష్ణుడు
Author(s) Nandula Venkateswara Rao
eISBN 978-93-7020-089-0
Book Language Telugu
Published Date March 2026
Book Edition First Edition

COMMENTS

    No Review found for book with Book title. కోనసీమ రుక్మిణి - కాలిఫోర్నియాకృష్ణుడు

LEAVE A Comment

Related Books

THAZHVAARAM
THAZHVAARAM..
  • IIP1746,
  • Print
₹ 192 ₹ 240
Add to cart
ECONOMIC FREEDOM STRUGGLE
ECONOMIC FREEDO..
  • IIP1899,
  • Print
₹ 160 ₹ 200
Add to cart
செம்மருதம்
செம்ம..
  • IIP1901,
  • Print
₹ 328 ₹ 410
Add to cart